
మహిళా మావోయిస్టుకు గాయాలు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మందుపాతర అమరుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పేలి ఓ మహిళా మావోయిస్టుకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం జరిగింది. బీజాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బందేపార అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మందుపాతర పేలి మహిళా మావోయిస్టు గుజ్జా సోడికి తీవ్ర గాయాలయ్యాయి. సహచర మావోయిస్టులు ఆమెను అక్కడే వదిలేసి, ఆయుధం తీసుకుని వెళ్లారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు పేర్కొన్నారు.
మందుపాతర అమరుస్తున్న
క్రమంలో ప్రమాదం