రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Oct 5 2025 2:26 AM | Updated on Oct 5 2025 2:26 AM

రామయ్

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలోని స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశా రు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావా చనం, అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరి పారు. వారాంతపు సెలవు దినాలు కావడంతో నిత్యకల్యాణంలో, ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు

ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదానికి, శ్రీ స్వామివారి విగ్రహానికి వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం గావించారు. శ్రీవారిని, శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నిత్య కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర అన్నదాన సేవా సమితి నిర్వాహకులు బొబ్బ కృష్ణప్రసాద్‌, ఎల్వీ నారాయణరెడ్డి, కాకుమాను లీలాకృష్ణ, ఇమ్మడి ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌, చొప్పవరపు శ్రీనివాసరావు, గిరిజాలక్ష్మి, తదితరులు 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.

జలవనరుల శాఖ

సీఈగా సుధీర్‌

పాల్వంచరూరల్‌: జలవనరుల శాఖ జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌గా(సీఈ)గా వరంగల్‌ జిల్లా సీఈ ఆర్‌.సుధీర్‌కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ పనిచేసిన సీఈ శ్రీనివాసరెడ్డి గత నెల 30న ఉద్యోగ విరమణ పొందాడు. ఆయన స్థానంలో సుధీర్‌ను నియమించారు.

నేడు మంత్రి

పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన పర్యటన ప్రారంభం కానుండగా ఖమ్మం నగరంతో పాటు కూసుమంచి, మధిర, వేంసూరు మండలాల్లో కొనసాగుతుంది. ఆయా మండలాల్లో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రేపు అండర్‌ –19 టీటీ ఎంపికలు

ఖమ్మం స్పోర్ట్స్‌ : ఉమ్మడి జిల్లాస్థాయి అండర్‌– 19 బాలబాలికల టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపికలు ఈనెల 6న ఉదయం 9 గంటలకు ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డి.మూసాకలీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తేదీన బాలబాలికల కబడ్డీ జట్లను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ వరకు చదువుతున్న వారు పోటీలకు అర్హులని, అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు జారీ చేసిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలని సూచించారు.

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన1
1/1

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement