
పార్టీ అభ ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి
కొత్తగూడెంఅర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొదెం వీరయ్య అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేయాలని అన్నారు. అనంతరం పొదెం వీరయ్య మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం అశ్వారావుపేట, ఇల్లెందు, సోమవారం పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి జెడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తామని, స్థానిక శాసనసభ్యుల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. తొలుత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల మౌనం పాటించారు. ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీలు మోతుకూరి ధర్మారావు, నాగ సీతారాములు, నాయకులు బాల శౌరి, ఏనుగుల అర్జునరావు, తోట దేవి ప్రసన్న, పసుపులేటి వీరబాబు, గడిపల్లి కవిత, కొత్వాల శ్రీనివాస్, కోనేరు చిన్ని, యడవల్లి కృష్ణ, బిక్కసాని నాగేశ్వరావు, జలీల్, మొహమ్మద్ ఖాన్, చీకటి కార్తీక్, రామ్ లక్ష్మణ్, సురేష్ నాయక్, గద్దల రమేష్, నూకల రంగారావు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో కాంగ్రెస్ నాయకులు