
పనిస్థలాలను పరిశుభ్రంగా ఉంచాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రతీ ఉద్యోగి పనిస్థలం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్పెషల్ క్యాంపెయిన్ 5.0 నోడల్ ఆఫీసర్, జీఎం ఎం.శ్రీహరి అన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాస్పత్రిలో ఈ నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం మాట్లాడుతూ పరిశుభ్రత, స్థలసృష్టి, సుందరీకరణ, వ్యర్థాల నిర్వహణ తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏసీఎంఓ ఎం.ఉష, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ ఎస్‌వీ రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ పీతాంబర రావు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.