
దసరా సెలవుల్లో దందా!
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ శివారులో మట్టి దందా ఆగడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులకు మట్టిని తరలించుకుపోతున్నారు. కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న మాఫియా దసరా సందర్భంగా ప్రభుత్వ సెలవులు రావడంతో రాత్రి వేళల్లో లారీల్లో కొద్దీ దర్జాగా తరలించారు. మండలంలోని పూసుగూడెం–మాధారం అటవీ ప్రాంతంలో సీతారామ ప్రధాన కాలువ సమీపం నుంచి భారీగా మట్టి తరలిస్తున్నారు. మీడియాలో పలుమార్లు కథనాలు రావడంతో ఇటీవల తోలకాలు నిలిపేశారు. పండుగ సెలవుల్లో మళ్లీ అక్రమంగా తరలించారు. గతంలో తరలించినచోటుతోపాటు సమీపంలోని కిలోమీటరు దూరంలో మరో చోట మట్టి తోలకాలు చేపట్టారు. పూసుగూడెం పంప్‌హౌస్‌కు వెళ్లే సీతారామ కాలువ సమీపంలో, కాలువ తవ్విన మట్టి గుట్టలా పోయగా, రోజురోజుకూ అది మాయమవుతోంది. జేసీబీతో లారీల్లో లోడ్ చేసి సమీప పట్టణాలకు తరలించి, అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలిసింది.
అక్రమంగా తరలిపోతున్న
సీతారామ ప్రాజెక్ట్ మట్టి