
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
మణుగూరు రూరల్: ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 233 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీలకు కేవలం ఐదు, ఒకే జెడ్పీటీసీ స్థానం కేటాయించడం దారుణమని అన్నారు. మణుగూరు మండలంలో రొటేషన్ ప్రకారం ఈ దఫా జెడ్పీటీసీ స్థానం ఎస్సీలకు ఇవ్వాల్సి ఉండగా, మళ్లీ ఎస్టీలకే కేటాయించారని ఆరోపించారు. కలెక్టర్ పరిశీలన చేసి జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు మద్దెల భద్రయ్య, వేర్పుల నరేష్, వేర్పుల సురేష్, బూర్గుల సతీష్, బూర్గుల సంజీవరావు, ముల్క నరేష్, ఏసురత్నం, వేమూరి రవి, ఉల్లోజు బాబీ, బూర్గులవెంకటరత్నం, వేర్పుల శంకర్, దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు