
ముగిసిన శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
భక్తులతో కిటకిటలాడిన
పెద్దమ్మతల్లి ఆలయం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన పెద్దమ్మతల్లి ఆలయంలో గత నెల 22న ప్రారంభమైన శ్రీ దేవీ శరన్నవరాత్రి వేడుకలు గురువారం ముగిశాయి. చివరి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమచ్చారు. కాగా, దసరా సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి సన్నిధిలో గురువారం సాయంత్రం శమీ పూజ నిర్వహించగా.. శుక్రవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు.
హస్తాల వీరన్నస్వామిని దర్శించుకున్న ఎస్పీ
చండ్రుగొండ: మండలంలోని బెండాలపాడు గ్రామ శివారులోని కనకగిరి అటవీ ప్రాంతంలో కొలువుదీరిన హస్తాల వీరన్నస్వామి వారిని ఎస్పీ రోహిత్ రాజ్ గురువారం దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, దిశ కమిటీ సభ్యులు బొర్రా సురేష్ తదితరులు ఉన్నారు.
జిల్లాకు కేంద్రీయ
విద్యాలయం మంజూరు
సూపర్‌బజార్(కొత్తగూడెం): పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుచేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయగా ఎట్టకేలకే ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రానికి నాలుగు విద్యాలయాలు కేటాయించగా, అందులో ఒకటి జిల్లాకు దక్కింది. ఎంపీ చొరవ, ప్రత్యేక శ్రద్ధతో జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైందని కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఆదివాసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కిన్నెరసానిలో
దసరా సందడి
రెండురోజుల పాటు భారీ ఆదాయం
పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో దసరా పర్వదినాన పర్యాటకులు సందడి చేశారు. గురు, శుక్రవారాల్లో జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. ఈ రెండు రోజుల్లో 1,795 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.1,07,515, 1,350 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.68,850 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కమ్యూనికేషన్స్, ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికి వరుసగా రెండోసారి అవకాశం దక్కింది. డాక్టర్ నిషికాంత్ దూబే చైర్మన్‌గా ఉన్న కమిటీలో ఏడాది క్రితం సభ్యుడిగా ఆయన నియమితులు కాగా, రెండో దఫా కూడా అవకాశం కల్పించారు. లోక్‌సభ నుంచి 20మంది, రాజ్యసభ ఉంచి పది మంది సభ్యులతో ఏర్పడే ఈ కమిటీలో రెండోసారి అవకాశం దక్కడంపై ఎంపీ రఘురాంరెడ్డికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతి నిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

ముగిసిన శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

ముగిసిన శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

ముగిసిన శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు