
రాష్ట్రంలో పాలన అధ్వానం
దమ్మపేట/అశారావుపేటరూరల్ : కాంగ్రెస్ హయాంలో పాలన అధ్వానంగా మారిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన దమ్మపేట మండలం పార్కలగండి, అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామాల్లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని సూచించారు. కేసీఆర్ సంక్షేమ పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఆ పార్టీ పెద్దల అక్రమార్జన సొమ్మంతా ఢిల్లీ మీదుగా బీహార్‌కు చేరుతోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో తెలంగాణ బీసీలను ఏమార్చి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఓట్ చోర్ అని తిరుగుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలానికి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో జెడ్పీ చైర్మన్‌తో పాటు అత్యధిక జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటుతుందని అన్నారు. అంతకుముందు పార్కలగండిలో పలువురు రేగా సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు రావు జోగేశ్వరరావు, దొడ్డా రమేష్, సున్నం నాగమణి, మందపాటి మోహన్‌రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు, నారం రాజశేఖర్, సోయం వీరభద్రం, దారా మల్లికార్జునరావు, యుగంధర్, రావుల శ్రీను, జలగం వాసు, పాకనాటి శ్రీను, యార్లగడ్డ శ్రీను, గాజుబోయిన ఏసు పాల్గొన్నారు.
ముఖ్య నాయకుల గైర్హాజరు..
ఆసుపాకలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, మాజీ జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీ, నాయకులు యూఎస్ ప్రకాశరావు, సంకా ప్రసాద్, కాసాని చంద్రశేఖర్‌తోపాటు మరికొందరు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సమావేశ వేదిక మార్పుతో పాటు పార్టీ మండల అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారమే దీనికి కారణమని కార్యకర్తలు చెబుతున్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా