
ఫుల్‌జోష్‌గా దసరా..
వైరా: ఒకే రోజు దసరా, గాంధీ జయంతి రావడంతో వైన్స్, బార్లు మూతపడ్డాయి. దీంతో వైన్స్ నిర్వాహకులు ముందస్తుగా సిద్ధం కావడం, మందుబాబులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో అమ్మకంపై ఎలాంటి ప్రభావం పడలేదు. వైరా మద్యం డిపో నుండి సెప్టెంబర్ 29న(సోమవారం), 30న (మంగళవారం) ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్లకు రూ.42.50 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సెప్టెంబర్ నెలంతా రూ.185 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లగా.. చివరి రెండు రోజుల్లో రూ.42కోట్లకు పైగా ఉండడం గమనార్హం.
ముందుగానే అమ్మకాలు
తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే దసరానే గుర్తుకొస్తుంది. బంధుమిత్రులతో కలిసి పండుగ జరుపుకునే పలువురి ఇళ్లలో మందు, విందు ఉంటుంది. కానీ ఈసారి దసరా రోజే గాంధీ జయంతి రావడంతో మందుబాబుల్లో ఆందోళన నెలకొనగా.. అమ్మకాలు ఎలా ఉంటాయోనని ఎకై ్సజ్ అధికారులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన ఎకై ్సజ్ సర్కిళ్ల వారీగా లక్ష్యాలు విధించి ముందుగా వైరా డిపో నుంచి మద్యం తీసుకెళ్లాలని సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్ 29న రూ.20కోట్లు, 30వ తేదీన రూ 22.50 కోట్ల విలువైన మద్యాన్ని వైన్స్, బార్ల నిర్వాహకులు తరలించడంతో ఎకై ్సజ్ శాఖకు గణనీయమైన ఆదాయం లభించింది. ఇక ఈనెల 1వ తేదీన మాత్రం రూ.కోటి విలువైన మద్యమే తీసుకెళ్లడం గమనార్హం. సాధారణంగా రోజుకు రూ.4కోట్ల నుండి రూ.6కోట్ల విలువైన మద్యం తీసుకెళ్తారు. కానీ 1వ తేదీన గణనీయంగా పడిపోవడానికి కారణాలు ఆరా తీసిన ఎకై ్సజ్ అధికారులు అంతకు ముందు రోజు భారీగా సరుకు తీసుకెళ్లడం.. 2వ తేదీన షాప్‌ల బంద్‌తో అమ్మకాలు ఉండవని వ్యాపారులు వెనక్కి తగ్గినట్లు గుర్తించారని సమాచారం. ఉమ్మడి జిల్లాలో 52బార్లు, మూడు క్లబ్‌లతో పాటుగా 210 వైన్స్‌కు వైరా డిపో నుంచి మద్యం తీసుకెళ్తారు.
జిల్లాలో రూ.42.50 కోట్ల మద్యం అమ్మకాలు

ఫుల్‌జోష్‌గా దసరా..