
●వేడుకలకు మంత్రి పొంగులేటి..
సింగరేణి స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన దసరా ఉత్సవాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. మొదలే ఆయన వచ్చి జ్యోతిప్రజ్వలన చేయగా.. ఆ సమయంలో వీక్షకులు లేక ఆవరణంతా ఖాళీగా కనిపించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయన ఇతర అంశాలు ఏమీ మాట్లాడకుండానే శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ ఎం.కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, మేనేజర్ అంకుషావళీ, డీఈ మురళీకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.