
అంతగా గుర్తించరని..
తనిఖీల్లో పట్టుబడితే జరిమానా
భద్రాచలంఅర్బన్: పండగలు వస్తే చాలు భద్రాచలంతో పాటు జిల్లాలో కొందరు వ్యాపారులు నకిలీ సరుకులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పప్పు, పాలు, పసుపు, పిండి, నూనె, కారం లేనిదే రోజు గడవదు. ఇక పండగలు అంటే చెప్పనవసరం లేదు. ఇక దసరా వచ్చిందంటే రకరకాల వంటకాలతో ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతుంది. అయితే, వాటి మాటునే కల్తీ ప్రమాదమూ పొంచి ఉండే అవకాశం ఉంది. వినియోగదారుల అవసరాలను ఆసరా చేసుకొని కొందరు వ్యాపారులు కల్తీ ఆహార పదార్థాలను అంటగడుతుంటారు. కొన్ని జాగ్రత్తలతో కల్తీ పదార్థాలను కనిపెట్టొచ్చంటున్నారు నిపుణులు.
పప్పును గుర్తించండి ఇలా..
వినియోగదారుల కళ్లు మెరిసేలా కొందరు వ్యాపారులు కంది, పెసర, మినుము లాంటి పప్పు దినుసులకు నూనె పూస్తుంటారు. కేసరి పప్పునకు మొటానిల్ ఎల్లో రంగు కలుపుతుంటారు. కేసరి పప్పును భూతద్దం సాయంతో గుర్తించవచ్చు. పరీక్ష నాళికలో కొద్దిగా పప్పును తీసుకొని నీటిని కలపాలి. వాటికి 5 మి.లీ గాడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపి 10 నిమిషాల తర్వాత పరిశీలిస్తే గులాబీ రంగులోకి మారితే అది కల్తీ అయినట్లు లెక్క. అయితే తెల్లగా ఉండే గోధుమ పిండిలో గంజి పొడి, బియ్య ం పిండి కలిపే ప్రమాదముంది. దీన్ని గుర్తించాలంటే కొద్దిగా గోధుమ పిండిని పరీక్ష నాళికలో తీసుకొని 5 మి.లీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపితే దట్టమైన పొగలు వస్తున్నాయంటే అది కల్తీ అయినట్లే. అంతేకాకుండా మిరప పొడిలో ఎరుపురంగు ఇటుక పొడి వంటి వాటిని ఉపయోగించి కల్తీ చేస్తారు.
నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతూ ప్రజలు తినే ఆహార పదార్థాల్లో హానికరమైన వస్తువులను కలిపి కల్తీ చేస్తున్నారు. మేము తనిఖీలు చేపట్టిన సమయంలో పట్టుబడితే అధికంగా జరిమానా విధిస్తాం. ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే విధంగా విక్రయిస్తూ పట్టుబడితే కోర్టులో శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటాం.
–కిరణ్‌కుమార్, జిల్లా ఆహార
కల్తీ నిరోధక శాఖ అధికారి