
మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం
ములకలపల్లి: మతిస్థిమితం లేని యువకుడు కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. అశ్వారావుపేట మండలానికి చెందిన సోడే జోగారావు ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడగా మతిస్థిమితం సరిగా ఉండడం లేదు. మండలంలోని రాజాపురంలోని బంధువులైన కారం బాబు ఇంటికి నాటుమందుల కోసం వచ్చాడు. శనివారం బాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిన జోగారావు తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో జోగారావు తండ్రి సోడియం దేవయ్య బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భద్రాచలంలో మహిళ..
భద్రాచలంఅర్బన్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మహిళ కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఆదర్శ్‌నగర్ కాలనీకి చెందిన రామచందర్‌రావు భార్య మద్ది సాయిషా(35) గత నెల 28న ఇంట్లో నుంచి బయ టకు వెళ్లి తిరిగిరాలేదు. ఎక్కడా వెతినికా ఆచూకీ లభించలేదు. కుటుంబ సమస్యల కారణంగా మన స్తాపంతో ఇంట్లో నుంచి వెళ్లి ఉండవచ్చని బుధ వారం ఆమె భర్త ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.