
5న సీపీఐ ‘శత వసంతాల’ సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐశత వసంతాల ముగింపు సభ డిసెంబర్‌లో ఖమ్మంలో జరగనుండగా, నేపథ్యాన అక్టోబర్ 5న సన్నాహక సమావేశం ఏర్పాటుచేసినట్లు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్.కే.సాబీర్ పాషా, దండి సురేష్ తెలిపారు. ఖమ్మం ఎస్ ఆర్ గార్డెన్స్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, బినాయ్ విశ్వం, కె.నారాయణ, అజీజ్ పాషా, పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి హాజ రవుతారని వెల్లడించారు. అలాగే, ఆహ్వాన సంఘ సమావేశానికి తెలంగాణతో పాటు వివిధ ఇతర రాష్ట్రాల నేతలు పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, ఎం.వీరపాండ్యన్, మహ్మద్ సలీం, సుందరేష్, పర్ష పద్మ, శ్రీనివాస్, ఈటి నర్సింహా, బాగం హేమంతరావు తదితరులు కూడా పాల్గొంటారని తెలిపారు.