
కేటీపీఎస్ 8వ దశ నివేదిక రూపొందించాలి
పాల్వంచరూరల్: కేటీపీఎస్ 8వ దశ నిర్మాణానికి నివేదిక రూపొందించాలని ఖమ్మం ఎంపీ ఆర్.రఘురాంరెడ్డి సూచించారు. 8వ దశ సాధన కమిటీ, టీఆర్‌వీకేఎస్ ఆధ్వర్యంలో కేటీపీఎస్ కాలనీలో సోమవారం ఎంపీని పూలమాలలు, శాలువాలతో వేర్వేరుగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేటీపీఎస్‌లో 8వ దశ కర్మాగార నిర్మాణంపై పార్లమెంట్‌లో చర్చకు లేవనెత్తగా కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో 8వ దశ సాధన సమితి అధ్యక్షుడు సీతారాంరెడ్డి, కన్వీనర్ మంగీలాల్, టీఆర్‌వీకేఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, పెద్దమ్మగుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఆళ్ల మురళి, చందుపట్ల శ్రీనివాసరెడ్డి, మహిపతి రామలింగం, రవికుమార్, రాంబాబు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మించాలని విన్నపం
పట్టణంలోని శ్రీనివాసకాలనీ శివారులో ఉన్న టెన్నిస్ క్రీడామైదానాన్ని ఎంపీ రఘురాంరెడ్డి సందర్శించారు. క్రీడాకారులు, క్రీడా సంఘాల బాధ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్ ట్రాక్, డ్రెయినేజీ తదితర సమస్యలు పరిష్కరించాలని జిల్లా టెన్నిస్, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్‌రెడ్డి విన్నవించారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మిక ప్రాంతం రామవరంలోని 7 నంబర్ బస్తీలో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారి సోమవారం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఆళ్ల మురళి, చీకటి కార్తీక్, పీతాంబరరావు, హరి సింగ్, ఉత్సవాల నిర్వాహకులు పాల్గొన్నారు.