
కుల వ్యవస్థను నిర్మూలించాలి
ఇల్లెందురూరల్: కుల వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. కుల వ్యవస్థ నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని మండలంలోని కొమరారం గ్రామంలో మాస్‌లైన్ ఆధ్వర్యంలో సోమవారం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ అణచివేత, ఆధిపత్యం కొనసాగిస్తున్న మనువాద హిందుత్వ భావజాలానికి, కుల దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే స్ఫూర్తితో ఉద్యమించాలని కోరారు. సమావేశంలో నేతలు ఆజ్మీర బిచ్చా, బుర్ర రాఘవులు, కాంపాటి పృథ్వి, బోస్, సావిత్రి, జగ్గులు, యలందర్, శాంతారావు, వాంకుడోత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో..
జూలూరుపాడు: మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జాటోత్ కృష్ణ అన్నారు.సోమవారం అన్నారుపాడు గ్రామంలో నిర్వహించిన సదస్సులో మాట్ల్లాడారు. నాయకులు ఏదులాపురం గోపాల్‌రావు, బానోత్ ధర్మా, లింగాల వీరభద్రం, తోటకూరి నరేశ్, బానోత్ ధన్వంతరావు, ఇరప రాజు, వీరు, నాగేశ్వరరావు, బాబు, వెంకన్న, నవీన్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య