
2 క్వింటాళ్ల గంజాయి సీజ్
బూర్గంపాడు: మండల పరిధిలోని మోరంపల్లి బంజర వద్ద సోమవారం తెల్లవారుజామున బూర్గంపాడు ఎస్సై మేడా ప్రసాద్ అనుమానాస్పద రీతిలో వేగంగా వెళ్తున్న ఓ కారును పట్టుకుని సోదాలు నిర్వహించారు. వాహనంలో తరలిస్తున్న 2.05 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారు నడుపుతున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.
భద్రాచలంలో 10 కిలోలు..
భద్రాచలంటౌన్: పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న ఆర్టీఓ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన ఎకై ్సజ్ అధికారులు బైక్‌పై తరలిస్తున్న 10.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన గోళ్ల గణేష్, మూరగుండ్ల ఆనంద్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులను భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ సీహెచ్ శ్రీహరిరావు తెలిపారు.