
నైపుణ్యం మెరుగుపర్చుకోవాలి
బూర్గంపాడు/మణుగూరురూరల్: ఏటీసీలతో యువత నైపుణ్యం మెరుగుపర్చుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన బూర్గంపాడు మండలం కృష్ణసాగర్, మణుగూరు ప్రభుత్వ ఐటీఐలలో నూతనంగా నిర్మించిన భవనాలను, ఎక్విప్‌మెంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీఐ కాలేజీలలో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి పూర్తైన విద్యార్థులు ఏటీసీల్లో శిక్షణ పొందాలని చెప్పారు. ఇక్కడ శిక్షణ పొందినవారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే 19 సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్స్ ధర్మాచారి, రవి, కార్మిక శాఖ అధికారులు రాజు, యేసుపాదంంతోపాటు చెంగలరావు, దేవదాసు, వేణు రామారావు, శివకుమార్, ఎం.శ్రీనివాసరావు, జీవీ.కృష్ణారావు, ఏ.నర్సయ్య, వేణుగోపాల్ పాల్గొన్నారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు