
భగత్‌సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలి
సుజాతనగర్: భగత్‌సింగ్ స్ఫూర్తితో విద్యా, ఉపాఽధి కోసం యువత ఉద్యమించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లిక్కి బాలరాజు, కాలంగి హరిక ృష్ణ పిలుపునిచ్చారు.శనివారం సుజాతనగర్‌లో నిర్వహించిన భగత్‌సింగ్ జయంతి వేడుకల్లో వారు మాట్లాడారు. నేటి పాలకులు స్వాతంత్య్ర స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ దేశసంపదను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. తొలుత భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాట్రాల తిరుపతిరావు, గండమాల భాస్కర్, ప్రశాంత్, వేణు, నీలావతి, కిషోర్, కావ్య, ప్రశస్త్ర తదితరులు పాల్గొన్నారు.