
జనరల్‌కే జెడ్పీ..
ప్రాదేశిక పోరుకు రిజర్వేషన్ల ఖరారు
జిల్లాలో అత్యధిక స్థానాలు ఎస్టీలకే..
22 జెడ్పీటీసీలు, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
చుంచుపల్లి: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. దీంతో ఎంతో కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. పూర్తి ఏజెన్సీ జిల్లా అయినందున అత్యధిక స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని మాత్రం జనరల్ అభ్యర్థులకు రిజర్వ్ అయింది. జిల్లా ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రం ఈ స్థానం ఎస్టీలకు రిజర్వ్ అయిన విషయం తెలిసిందే.
సర్వం సిద్ధం..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ ఓటర్ల తుది జాబితాలను అందుబాటులో ఉంచారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు, ఇతర ఏర్పాట్లపై అధికారులు నెలరోజులుగా కసరత్తు చేస్తుండగా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్టయింది. ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని, బ్యాలెట్ బాక్సులను, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో 22 మండలాలు ఉండగా తొలి విడతలో 12, రెండో విడతలో 10 మండలాల్లో పోలింగ్ జరగనుంది.
22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు..
జిల్లాలో 22జెడ్పీటీసీ, 233ఎంపీటీసీ స్థానాలున్నా యి. ఎంపీటీసీ స్థానాలు అశ్వాపురం మండలంలో 12, అశ్వారావుపేటలో 11, భద్రాచలం 14, బూర్గంపాడు 17, చండ్రుగొండ 8, అన్నపురెడ్డిపల్లి 6, చర్ల 12, దమ్మపేట 17, దుమ్ముగూడెం 13, గుండాల 5, ఆళ్లపల్లి 5, జూలూరుపాడు 10, లక్ష్మీదేవిపల్లి 11, సుజాతనగర్ 5, చుంచుపల్లి 12, మణుగూరు 11, ముల్కలపల్లి 10, పాల్వంచ 10, పినపాక 9, కరకగూడెం 5, టేకులపల్లి 14, ఇల్లెందు మండలంలో 16 స్థానాలు ఉన్నాయి. వీటిలో ఎస్టీలకు 123, ఎస్సీలకు ఐదు, బీసీలకు 18, జనరల్ అభ ్యర్థులకు 87 కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 6,69,048 మంది ఓటర్లు ఉండగా పురుషులు 3,25,045, మహిళలు 3,43,979, ఇతరులు 24 మంది ఉన్నట్టు గుర్తించారు. ప్రాదేశిక ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 1,271 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎట్టకేలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలు కానుంది.
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా చేపట్టాం. జిల్లాలోని 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ, 22 ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లను కేటాయించాం. ఎక్కువ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. షెడ్యూల్ ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం.
– బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ
మండలం జెడ్పీటీసీ(రిజర్వ్‌డ్) ఎంపీపీ (రిజర్వ్‌డ్)
ఆళ్లపల్లి జనరల్(మహిళ) ఎస్టీ(జనరల్)
అన్నపురెడ్డిపల్లి (ఎస్టీ జనరల్) ఎస్టీ(మహిళ)
అశ్వాపురం ఎస్టీ(జనరల్) ఎస్టీ (జనరల్)
అశ్వారావుపేట ఎస్టీ (మహిళ) ఎస్టీ (మహిళ)
భద్రాచలం బీసీ (మహిళ) ఎస్టీ (మహిళ)
బూర్గంపాడు ఎస్టీ (జనరల్) బీసీ (జనరల్)
చండ్రుగొండ ఎస్టీ (మహిళ) ఎస్టీ (జనరల్)
చర్ల బీసీ(జనరల్) ఎస్టీ (మహిళ)
చుంచుపల్లి ఎస్సీ(జనరల్) ఎస్టీ (మహిళ)
దమ్మపేట ఎస్టీ (మహిళ) జనరల్
దుమ్ముగూడెం జనరల్ ఎస్టీ (జనరల్)

జనరల్‌కే జెడ్పీ..

జనరల్‌కే జెడ్పీ..