
డీజేల మోత.. భూ సమస్య వెత
సూపర్‌బజార్(కొత్తగూడెం):భూ సమస్య పరిష్కరించాలంటూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రామన్నగూడెం ఆదివాసీ రైతులు ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకల నేపథ్యంలో కలెక్టరేట్‌లో వివిధ ప్రభు త్వ శాఖల ఆధ్వర్యంలో ప్రతి రోజు రాత్రి డీజే సౌండ్‌తో బతుకమ్మ ఆడుతున్నారు. దీంతో కలెక్టరేట్ పరి సర ప్రాంతాల్లో ఒకవైపు హర్షధ్వానాలు, మరో వైపు హాహాకారాలు వినిపిస్తున్నాయి. భూసమస్య పరి ష్కారం కోసం 250 ఆదివాసీ కుటుంబాలు పిల్లాపాపలతో నిరాహారదీక్ష చేపట్టిన విషయం విదితమే. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురవగా దీక్షా శిబిరం వద్ద ఆదివాసీల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. దోమల కారణంగా కొంద రు జ్వరాల బారిన పడగా, పిల్లలకు దుప్పట్లు కప్పు తూ రక్షించుకునేందుకు తల్లిదండ్రులు తెల్లవార్లు జాగారం చేయాల్సి వచ్చింది.
సర్వేకు సమాయత్తం..
రామన్నగూడెం ఆదివాసీల భూ సమస్యపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచే భూముల సర్వేకు రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో సమాయత్తం అవుతున్నట్టు తెలిపారు. ఆయా శాఖల పరిధిలో ఎంత భూమి ఉంది, ఆదివాసీల పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఎంత భూమి ఉంది అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేసి కలెక్టర్‌కు నివేదిస్తామని చెప్పారు. కాగా, సర్వే ప్రారంభిస్తామని అశ్వారావుపేట తహసీల్దార్ రామకృష్ణ ఫోన్ ద్వారా సమాచారం అందించారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి మడకం నాగేశ్వరరావు తెలిపారు. అయితే కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు నిరాహారదీక్ష విరమించేది లేదని ఆదివాసీలు స్పష్టం చేశారు.
కలెక్టరేట్ పరిసరాల్లో విచిత్ర పరిస్థితి