
కేటీపీఎస్‌లో భారీగా తగ్గిన విద్యుదుత్పత్తి
పాల్వంచ: ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు, నాణ్యత లేని బొగ్గు కారణంగా కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో విద్యుత్ ఉత్పత్తిపై భారీగా ప్రభావం పడుతోంది. విద్యుత్ డిమాండ్ తగ్గడంతో యూనిట్లను రిజర్వ్ షట్‌డౌన్‌లో ఉంచాల్సి వస్తోంది. 5, 6, 7 దశల కర్మాగారాల్లో 1,800 మెగావాట్లకు గాను ప్రస్తుతం 1,200 మెగావాట్లు మాత్రమే నడుస్తున్నట్లు తెలుస్తోంది. 5వ దశ కర్మాగారంలో 250 మెగావాట్ల సామర్థ్యం గల 8వ యూనిట్‌ను శుక్రవారం వరకు బ్యాక్‌డౌన్‌లో ఉంచగా శనివారం తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. 9వ యూనిట్ 250 మెగావాట్లు పూర్తిగా రిజర్వ్ షట్‌డౌన్ చేశారు. 500 మెగావాట్ల సామర్థ్యం గల 10వ యూనిట్‌లో నాణ్యత లేని బొగ్గు వినియోగంతో 370 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే వస్తోంది. 7వ దశలో 800 మెగావాట్లకు గాను 710 మెగావాట్లు మాత్రమే వస్తోంది. జల విద్యుత్ అధికంగా వస్తున్న క్రమంలో రాత్రి వేళ హైడల్ విద్యుత్‌ను, పగలు మాత్రమే థర్మల్ విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో థర్మల్ కేంద్రాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ విషయమై 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్‌రావును వివరణ కోరగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఉత్పత్తిని తగ్గిస్తున్నామని, నాణ్యత లేని బొగ్గుతో కూడా ఉత్పత్తి తగ్గిందని తెలిపారు.
రిజర్వ్ షట్‌డౌన్‌లో పదో యూనిట్
250 మెగావాట్లు