
‘మద్యం’ దరఖాస్తులకు ఏర్పాట్లు..
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2025–27 నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో మొత్తం 88 వైన్ షాపులుండగా 44 ఎస్టీలకు, 31 జనరల్ కేటగిరీకి, ఎస్సీ 7, గౌడ్ 6 కేటాయించినట్లు చెప్పారు. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం కౌంటర్లు ఏర్పాటు చేశామని, తొలి రోజు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని అన్నారు. టెండర్‌లో పాల్గొనేందుకు గానూ రూ.3 లక్షల ఫీజును ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గతేడాది 5,057 దరఖాస్తులు వచ్చాయని, ఈ ఏడాది అంతకంటే ఎక్కువ రావొచ్చని అన్నారు. అక్టోబర్ 18వ తేది వరకు గడువు ఉందని, 23న డ్రా తీస్తామని తెలిపారు. ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్ ఎస్సై గౌతమ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య