
ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్‌ఐ
మణుగూరు టౌన్: కారు చోరీ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40వేల లంచం డిమాండ్ చేసిన మణుగూరు ఎస్సై రంజిత్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో ఇద్దరు నిందితులు స్టేషన్ బెయిల్ కోసం కొన్నాళ్ల క్రితం ఎస్సైను ఆశ్రయించారు. ఇందుకోసం ఆయన రూ.40 వేలు డిమాండ్ చేశాడు. కొద్దిమేర తగ్గించాలని కోరినా ఎస్సై ససేమిరా అనడంతో వారు ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. ఆపై గతంలోనే డబ్బు ఇచ్చేందుకు వచ్చినా అనుమానంతో తీసుకోలేదు. ఈమేరకు ఫిర్యాదుదారుల నుంచి సేకరించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌ల ఆధారంగా ఎస్సై రంజిత్‌పై 7బీ కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. తనిఖీల్లో ఖమ్మం ఏసీబీ సీఐలు శేఖర్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.
స్టేషన్ బెయిల్‌కు
రూ.40వేల లంచం డిమాండ్