
కరెన్సీ నోట్లతో అలంకరణ..
ములకలపల్లి/పాల్వంచ/ఇల్లెందురూరల్/: పాల్వంచ పట్టణంలోని శివనగర్–వికలాంగుల కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు. మండపాన్ని రూ.21లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ములకలపల్లి ఉమా పృథ్వీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.5 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇల్లెందు మండలంలోని సుభాష్‌నగర్ రామాలయంలో మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారిని రూ.5 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు.

కరెన్సీ నోట్లతో అలంకరణ..

కరెన్సీ నోట్లతో అలంకరణ..