
ఐలమ్మ ఆశయసాధనకు కృషి చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. మొదట కలెక్టర్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమించారన్నారు. 1940 – 44 మధ్య కాలంలో విస్నూర్‌లో దేశ్‌ముఖ్, రజాకార్ల అరాచకాలపై ఎదురుతిరిగి పోరాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళల్లో స్ఫూర్తి నింపారని, ఆమె పోరాట స్ఫూర్తి తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను నిర్వహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి పి.విజయలక్ష్మి, బీసీ సంఘం నాయకులు నేరెళ్ల రమేశ్, అజిత్‌కుమార్, సర్వేశ్, కె.వసంతరావు, బి.శ్రీనివాస్, ఆర్.వెంకటయ్య, ఎం.భిక్షం, బి.జయమ్మ, కొదుమూరి సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రయత్నించడంలోనే విజయం ఉంటుంది..
పాల్వంచ: ప్రయత్నం చేయడంలోనే విజయం దాగి ఉంటుందని, జీవితంలో ప్రయత్నం చేస్తే లక్ష్యాలు సాధించవచ్చని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీనివాసకాలనీ మినీ స్టేడియం టెన్నిస్ క్రీడా మైదానంలో ఈ నెల 21వ తేదీన జిల్లా టెన్నిస్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. హైదరాబాద్ ఓపెన్ నేషనల్ టెన్నిస్ అండర్–60లో రన్నరప్‌గా నిలిచిన అన్నం వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా నేషనల్ ఆర్చరీ విభాగానికి ఎంపికై న వంశీని అభినందించి, మాట్లాడారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్‌రెడ్డి, టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.వెంకటేశ్వర్లు, సెక్రటరీ జకరయ్య, కోచ్ డానియేల్ రాంబాబు, భాస్కర్, కబీర్, దాట్ల రాజు, కుటుంబరావు, కృష్ణారావు, రాజ్‌కుమార్, సతీశ్, టెన్నిస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్‌కు
ఏడాది జైలు శిక్ష
భద్రాచలంఅర్బన్: బస్సుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఓ వ్యక్తి మృతికి కారణమైన భద్రాచలం ఆర్టీసీ డిపోకి చెందిన డ్రైవర్ సూర్యనారాయణకు ఏడాది జైలుశిక్షతోపాటు రూ.1000 జరిమానా విధిస్తూ భద్రాచలం ప్రథమశేణి న్యాయమూర్తి శివనాయక్ తీర్పునిచ్చారు. ద్విచక్రవాహనంపై వస్తున్న సయ్యద్ సోహైల్‌ను 2017 డిసెంబర్ 12న బూర్గంపాడు సమీపంలోని సమక్క – సారలమ్మ గద్దెల వద్ద బస్సు ఢీకొట్టింది. సోహైల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనకు సంబంధించి మృతుడి తల్లి సయ్యద్ హసీనాబేగం బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం 2018లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సోహైల్ మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ సూర్యనారాయణకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

ఐలమ్మ ఆశయసాధనకు కృషి చేయాలి