
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు..
మణుగూరుటౌన్: ప్రేమించి, వివాహం చేసుకుంటానని నమ్మించడంతో కలిసి ఉంటున్నామని, అతడికి మరో మహిళతో గతంలో వివాహం జరిగిందని తెలిసి ప్రశ్నించేందుకు వచ్చిన తనపై దాడి చేసి హత్యాయత్నం చేశారని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి తెలిపింది. శుక్రవారం బాధితురాలు విలేకరులతో వివరాలు వెల్లడించింది. మండలంలోని వాగుమల్లారానికి చెందిన మట్టా గణేశ్‌తో ఏపీ రాష్ట్రం కడప శివారుకు చెందిన యువతికి మూడేళ్ల కిందట బెంగుళూరులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లు బెంగుళూరులో ఆ తర్వాత ఏడాది నుంచి హైదరాబాద్ షేక్‌పేటలో కలిసి ఉంటున్నారు. కొద్దికాలంగా అతని ప్రవర్తనలో మార్పు రాగా, అనుమానంతో ఆరా తీయగా, వివాహం జరిగి పిల్లలు ఉన్నట్లు తెలిసిందని, ఈ విషయమై ప్రశ్నించేందుకు వాగు మల్లారంలోని గణేశ్ ఇంటికి జూలై 15న రాగా తనను విచక్షణా రహితంగా అతడి భార్య మట్టా రాశిశుక్రియా, ఆమె తల్లి గొడుగు రమాదేవి, గణేశ్ తండ్రి కలిసి హత్యా యత్నం చేశారని బాధితురాలు వెల్లడించింది. తన వద్ద పలు దఫాలుగా రూ.10 లక్షలు తీసుకున్నాడని ఆధారాలు చూపింది. అనారోగ్యం పాలయ్యానని పేర్కొంది. కాగా, కడప జిల్లాకు చెందిన యువతి మండలంలోని మహిళా సంఘాలను ఆశ్రయించడంతో అండగా నిలిచాయి. దిశ, రేణుక అక్షర మహి ళా మండలి, సఖి ప్రతినిధులు మట్టా గణేశ్‌తో పాటు యువతిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థాని క డీఎస్పీ రవీందర్‌రెడ్డికి యువతితో కలిసి ఫిర్యాదు చేశారు. సమావేశంలో పూనెం సరోజ, షబానా, కోరి శ్యామల, బొడ్డు సౌజన్య, సుజాత, రేణుక, దేరంగుల సుజాత, కన్నాపురం వసంత, దిశ అధ్యక్షురాలు అనిత, సఖి మండలి నాయకురాలు భోగినేని వరలక్ష్మి, బత్తుల సుజాత, బీస మహిళా కమిటీ మండల అధ్యక్షురాలు కవిత, శిరీష, నర్సమ్మ, రోహిణి, జయమ్మ తదితరులు ఉన్నారు.
బాధితురాలి ఆవేదన..
అండగా మహిళా సంఘాలు