
4,104 కేజీల నల్లబెల్లం స్వాధీనం
అశ్వారావుపేటరూరల్: సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికతో పాటు నాటుసారా తరలిస్తున్న ఓ వాహనాన్ని ఖమ్మం జిల్లా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. దసరా సందర్భంగా సారా తయారీకి అవకాశముందనే సమాచారంతో నల్లబెల్లం రవాణాను అడ్డుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ మేరకు అశ్వారావుపేటలోని చెక్‌పోస్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ సీహెచ్ శ్రీహరి ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి తెలంగాణలోకి వస్తున్న టాటా ఇంట్రా వాహనాన్ని తనిఖీ చేయగా 4,104 కేజీల నల్లబెల్లం, 30 కేజీల పటిక, 10 లీటర్ల నాటుసారా లభించాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొడమంచిలి క్రాంతి, సవరపు రవి, పులిదిండి హరీశ్ అశ్వారావుపేటకు వీటిని తరలిస్తున్నట్లు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా హరీశ్ పరారీలో ఉన్నాడు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ కరీం, సిబ్బంది సుధీర్, వెంకట్, ఉపేందర్ పాల్గొన్నారు.
ఏపీ నుంచి తరలిస్తుండగా
పట్టుకున్న అధికారులు