
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమ
నత్తనడకన సాగుతున్న
సర్జికల్ బ్లాక్ పనులు
అనంతపురం మెడికల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాకు సర్జికల్, ఎంసీహెచ్ బ్లాక్స్, పీజీ హాస్టళ్లు మంజూరు అయ్యాయి. అప్పట్లోనే నాడు–నేడు కింద రూ.300 కోట్లు కేటాయించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సకాలంలో పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో వేగంగా చర్యలు తీసుకున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 8 విభాగాలకు సంబంధించి అత్యవసర సేవల్లో భాగంగా రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కూటమి సర్కారు శాపం..
కూటమి ప్రభుత్వంలో సర్జికల్, ఎంసీహెచ్ బ్లాక్, క్రిటికల్ కేర్, పీజీ హాస్టళ్ల నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. చంద్రబాబు సర్కారు వచ్చీ రాగానే నిధులను భారీగా కుదించింది. రూ.300 కోట్లను కేవలం రూ. 78 కోట్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మించ తలపెట్టిన ఆర్‌అండ్‌బీ కార్యాలయ స్థలాన్ని ఇంత వరకు స్వాధీనం చేసుకోలేదంటే పేదల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో అర్థం చేసుకోవచ్చు. ఇక.. మిగిలిన భవన నిర్మాణ పనుల్లోనూ వేగం తగ్గింది.ప్రస్తుతం నత్తకంటే ఘోరంగా సాగుతున్నాయి. సర్కారు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సర్జికల్, పీజీ హాస్టల్, ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు మోక్షమెప్పుడు లభిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సర్వజనాస్పత్రికి రోగుల తాకిడి అధికమైన నేపథ్యంలో.. నేడు కూటమి సర్కారు శాపంతో బాలింతలు, గర్భిణులతో పాటు ఆస్పత్రిలో రోగులు నరకం చూడాల్సి వస్తోంది.
పీజీలకు తప్పని అవస్థలు..
అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ తదితర విభాగాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 117 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 92, మూడో సంవత్సరంలో 60 మంది కలుపుకుని మొత్తం 269 మంది పీజీ విద్యార్థులున్నారు. హాస్టల్ సదుపాయం లేకపోవడంతో వీరిలో చాలా మంది ఆస్పత్రి ఆవరణంలో ఉన్న సీనియర్ రెసిడెంట్ హాస్టల్‌లోనే అవస్థలు పడుతూ నెట్టుకొస్తుండగా.. చాలా మంది విద్యార్థులు అద్దె గదుల్లో ఉంటూ విద్యనభ్యసిస్తుండడం గమనార్హం.
నత్తనడకన సర్జికల్, ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ నిర్మాణ పనులు
పేదల సంక్షేమమే లక్ష్యంగా
వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు
అప్పట్లోనే రూ.300 కోట్ల కేటాయింపు
వచ్చీ రాగానే నిధులను
కుదించిన చంద్రబాబు ప్రభుత్వం
సర్కారు శాపంతో సా....గుతున్న పనులు
రోగులకు తప్పని అవస్థలు