
ఉపాధిలో మాయాజాలం
● 10 మంది హాజరైతే 50 మంది వచ్చినట్లు చూపిన వైనం
పామిడి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో సిబ్బంది మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. జేబులు నింపుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టారాజ్యంగా కూలీలను నమోదు చేస్తూ డబ్బు వెనకేసుకుంటున్నారు. వివరాలు.. పామిడి గ్రామ పంచాయతీలో ఈ నెల 4న కేవలం 10 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. అయితే, కూలీలను నమోదు చేసే ఎన్‌ఎంఎంఎస్‌లో మాత్రం 50 మంది పనులకు వచ్చినట్లుగా నమోదు చేశారు. ఫొటోలు ఒకటే అయినా పేర్లు మాత్రం వేర్వేరుగా నమోదు చేసి అప్‌లోడ్ చేశారు. ఈ తంతు నిత్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, ఎక్కడో ఒక లోపాన్ని కనుగొని మాయ చేస్తుండడంగమనార్హం. ఒక్క పామిడి పంచాయతీలోనే కాదు.. జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఉపాధి సిబ్బంది ఇలాగే బురిడీ కొట్టిస్తూ, ప్రతి నెలా రూ. లక్షలు మింగేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా మండలాల అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలా జరుగుతోందని, జిల్లా స్థాయి అధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పామిడిలో కూలీల ఫొటోలను కొద్దిగా మార్చి వేర్వేరు పేర్లను నమోదు చేసిన దృశ్యాలు

ఉపాధిలో మాయాజాలం

ఉపాధిలో మాయాజాలం