జిల్లాకు 989 మెట్రిక్‌ టన్నుల యూరియా | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు 989 మెట్రిక్‌ టన్నుల యూరియా

Oct 8 2025 9:58 AM | Updated on Oct 8 2025 9:58 AM

జిల్ల

జిల్లాకు 989 మెట్రిక్‌ టన్నుల యూరియా

అనంతపురం అగ్రికల్చర్‌:‘స్పిక్‌’ కంపెనీ నుంచి 988.875 మెట్రిక్‌ టన్నుల యూరియా మంగళవారం జిల్లాకు చేరినట్లు రేక్‌ ఆఫీసర్‌, ఏడీఏ అల్తాఫ్‌ అలీఖాన్‌ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్‌ రేక్‌పాయింట్‌లో వ్యాగన్ల ద్వారా జిల్లాకు సరఫరా అయిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు 649.98 మెట్రిక్‌ టన్నులు మార్క్‌ఫెడ్‌కు, 338.895 మెట్రిక్‌ టన్నులు ప్రైవేట్‌ డీలర్లకు కేటాయించి అక్కడి నుంచి ఇండెంట్ల మేరకు ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, రీటైల్‌ దుకాణాలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

కాల్‌సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సులో శిక్షణ

అనంతపురం క్రైం: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాల్‌సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులై 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులన్నారు. అనంతపురం నగర శివారులోని టీటీడీసీ సెంటర్‌లో 90 రోజుల పాటు కంప్యూటర్‌ స్కిల్స్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌పై శిక్షణ ఉంటుందన్నారు. ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9492018354, 8639448535 నంబర్లకు కాల్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

ఐసీడీఎస్‌ పీడీ నాగమణిపై సస్పెన్షన్‌ వేటు

అనంతపురం సెంట్రల్‌: మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.నాగమణిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న రెండు నెలల బాలుడు నిరూప్‌ ఈనెల 3న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నిర్లక్ష్యం వహించడంతో పాటు నివేదికను పై అధికారులకు అందించడంలో జాప్యం చేసిన కారణంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు మహిళా,శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం, అంతర్గత పోరు కారణంగా బిడ్డ మరణం సంభవించిందని, బిడ్డకు సరిగా ఆహారం ఇవ్వడంలో విఫలమైనట్లు గుర్తించామని తెలిపారు. బాలుడికి వైద్యపరంగా శిశుగృహ సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయించడంలో పీడీ విఫలమయ్యారని వివరించారు.

భూ సమస్యలు

పరిష్కరించాలి

అధికారులకు కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశం

అనంతపురం అర్బన్‌: సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటు క్రమంలో ఏవైనా భూ సమస్యలు ఉంటే పరిష్కరించాలని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్‌ ప్రాజెక్టుకు భూ సేకరణపై కలెక్టర్‌ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ, ఏపీఎన్‌జీఈఎల్‌ (ఎన్‌టీపీసీ) డెవలప్‌మెంట్‌ అధికారి కిషోర్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంబదూరు మండలం చెన్నంపల్లి వద్ద సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు 5,862 ఎకరాలు గుర్తించామన్నారు. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే నెల రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ, సోలార్‌ ప్రాజెక్టు, నెడ్‌క్యాప్‌, సర్వే శాఖల అధికారులతో బృందం ఏర్పాటు చేసుకుని రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. సమావేశంలో కళ్యాణదుర్గం ఆర్‌డీఓ వసంతబాబు, సర్వే ఏడీ రూప్లానాయక్‌, ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, భూ విభాగం సూపరింటెండెంట్‌ రియాజుద్ధీన్‌, డీటీ సురేఖరావు, ఎన్‌టీపీసీ అధికారులు శివకుమార్‌, వినోద్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు 989 మెట్రిక్‌ టన్నుల యూరియా 1
1/2

జిల్లాకు 989 మెట్రిక్‌ టన్నుల యూరియా

జిల్లాకు 989 మెట్రిక్‌ టన్నుల యూరియా 2
2/2

జిల్లాకు 989 మెట్రిక్‌ టన్నుల యూరియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement