
17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి
అనకాపల్లి: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన, నిర్మిస్తున్న 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం అన్యాయమని, వాటిని ప్రభుత్వమే నడపాలని అనకాపల్లి మండల పరిషత్ సమావేశంలో తీర్మానించారు. సోమవారం జరిగిన మండల సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీపీ గొర్లి సూరిబాబు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టిందని, ఆ సంకల్పానికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడవడం అన్యాయమన్నారు. 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు.
అనకాపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం