డ్వాక్రా రుణాలు గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రా రుణాలు గోల్‌మాల్‌

Oct 7 2025 3:47 AM | Updated on Oct 7 2025 3:47 AM

డ్వాక

డ్వాక్రా రుణాలు గోల్‌మాల్‌

వెలుగు, బ్యాంక్‌ సిబ్బందికుమ్మకై ్క మోసం

గోవాడ ఎస్‌బీఐ ఎదుట బాధితడ్వాక్రా సంఘాల సభ్యుల ఆందోళన

3 గంటల పాటు బ్యాంక్‌ విధులకు ఆటంకం

వెలుగు వీవోఏపై కేసు నమోదు చేసిన పోలీసులు

చోడవరం: డ్వాక్రా రుణాల గోల్‌మాల్‌ వ్యవహారంపై గోవాడ ఎస్‌బీఐ ఎదుట బాధిత డ్వాక్రా మహిళలు సోమవారం ఆందోళనకు దిగారు. మరోవైపు పలు డ్వాక్రా సంఘాల పేరున బినామీ రుణాలు తీసుకొని మహిళలను మోసం చేశారంటూ వెలుగు శాఖలో ప నిచేస్తున్న సింహాద్రిపురం వీవోఏ వరలక్ష్మిపై చోడ వరం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. సింహాద్రిపురం పంచాయతీ పరిధిలో 15 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల నిర్వహణ కోసం వెలుగు శాఖ నుంచి వీవోఏగా వరలక్ష్మి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సబ్బవరపు కల్లాలకు చెందిన శ్రీరామ డ్వాక్రా సంఘం సభ్యులకు రూ.7.50 లక్షల రుణానికి సంబంధించి అప్పు తీర్చాలంటూ గోవాడ ఎస్‌బీఐ నుంచి మెసేజ్‌లు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వీవోఏ వరలక్ష్మిని తీసుకుని బ్యాంక్‌కు వెళ్లడంతో అసలు బాగోతం బయటపడింది. గతేడాది ఫిబ్రవరిలో శ్రీరామ డ్వాక్రా సంఘానికి రూ.7.50 లక్షలు, శ్రీసిద్ధి వినాయక డ్వాక్రా సంఘానికి రూ.2 లక్షలు రుణం ఇచ్చినట్టుగా గోవాడ స్టేట్‌ బ్యాంక్‌ రికార్డుల్లో ఉంది. అయితే ఆ మొత్తం సంబంధిత డ్వాక్రా గ్రూపు సభ్యుల ఖాతాల్లోకి మాత్రం జమ కాలేదు. మరి ఈ సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందని ఆరా తీయడంతో మోసం బయటపడింది.

నిబంధనల ప్రకారం డ్వాక్రా సంఘాలకు బ్యాంక్‌ రుణం మంజూరు చేసేటప్పుడు సంఘ సభ్యుల సంతకాలు, వారి గ్రూపు ఫొటోతో తమకు బ్యాంక్‌ రుణం కావాలంటూ దరఖాస్తును వెలుగు వీవోఏ, సీసీ ద్వారా బ్యాంక్‌కు అందజేయాలి. బ్యాంక్‌ అధికారుల పరిశీలన అనంతరం రుణం మంజూరు చేసి సంఘ సభ్యులను బ్యాంక్‌కు పిలిచి వారితో సంతకాలు చేయించుకొని మంజూరు చేసిన రుణం డబ్బును సదరు డ్వాక్రా సంఘం సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే శ్రీరామ డ్వాక్రా సంఘానికి మంజూరైన రుణం మాత్రం అలా జరగలేదు. ఈ సంఘం నుంచి గతంలో రుణం కావాలని బ్యాంక్‌కు దరఖాస్తు చేస్తే అప్పట్లో అధికారులు తిరస్కరించారు. ఆ పత్రాలను వీవోఏ వరలక్ష్మి తన వద్ద ఉంచుకొని సంఘ సభ్యులకు తెలియకుండా బ్యాంక్‌ రుణం కోసం రెండోసారి దరఖాస్తు చేసింది. బ్యాంక్‌ అధికారులు కూడా ఆమెతో కుమ్మకై ్క రుణం మంజూరు చేశారు. ఈ రుణం డబ్బులను కొత్తగా ఖాతాలు తెరిచి అందులో జమ చేసుకున్నారు. ఆ డబ్బులను బ్యాంక్‌ అధికారులు, వీవోఏ కలిసి విత్‌డ్రా చేసుకొని పంచుకున్నారంటూ బాధిత శ్రీరామ డ్వాక్రా సంఘం సభ్యులు ఆరోపిస్తూ సోమవారం ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారమంతా గతేడాది నవంబరు 12న జరిగింది. అప్పట్లో ఫిర్యాదు చేయగా.. ఎస్‌బీఐ అధికారులు, వెలుగు శాఖల అధికారులు విచారణ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమ పేరున ఇంకా బ్యాంక్‌ రుణం ఇచ్చినట్టుగానే రికార్డుల్లో ఉండడంతో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వెన్నెల యోగిత, సబ్బవరపు సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వారు వాపోయారు. తమ సంఘాల పేరున బ్యాంక్‌లో రుణం లేనట్టుగా ఎన్‌వోసీ కావాలని పలుమార్లు గోవాడ ఎస్‌బీఐ అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని సభ్యులు మండిపడ్డారు. మరోసారి బ్యాంక్‌ ముందు బైఠాయించి తలుపులు మూసివేశారు. డ్వాక్రా మహిళల ఆందోళనతో బ్యాంక్‌ లావాదేవీలకు సుమారు 3 గంటల పాటు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని బ్యాంక్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చోడవరం సీఐ అప్పలరాజు సిబ్బంది వచ్చి పరిస్థితిని సమీక్షించారు. బాధిత మహిళలతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. ఈ గోల్‌మాల్‌లో కీలకపాత్ర పోషించిన వెలుగు వీవోఏ వరలక్ష్మిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

మోసం సుమారు రూ.20 లక్షలు

సబ్బవరపువారి కల్లాలకు చెందిన డ్వాక్రా మహిళలంతా వ్యవసాయం, కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. వీరికి బ్యాంక్‌కు వెళ్లే సమయం లేకపోవడంతో ప్రతి నెలా వాయిదా డబ్బులు వెలుగు వీవోఏ వరలక్ష్మికి ఇచ్చేవారు. ఆమె కొంత కాలంగా బ్యాంక్‌కు కట్టకుండా రూ.20 లక్షలు కాజేసిందని వారు ఆరోపించారు.

డ్వాక్రా రుణాలు గోల్‌మాల్‌ 1
1/1

డ్వాక్రా రుణాలు గోల్‌మాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement