
యువకుడు గల్లంతు
పాయకరావుపేట: పాల్మన్‌పే ట సముద్ర తీరంలో స్నేహితులతో సరదాగా స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. మైరెన్ పోలీసు ఎస్‌ఐ డి.రత్నశేఖర్, స్థానిక ఎస్‌ఐ పురుషోత్తం తెలిపిన వివరాలు.. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామం నుంచి ఆటోలో 11 మంది యువకులు సోమవారం సముద్ర స్నానాలకు వెళ్లారు. స్నానాలు చేసి ఒడ్డుకు వచ్చే క్రమంలో పి.అశోక్, దుర్గాప్రసాద్ కెరటాల తాకిడికి కొట్టుకుపోయారు. దుర్గాప్రసాద్‌ను స్థానికంగా ఉన్న మత్స్యకారులు రక్షించారు. అశోక్ మాత్రం సముద్రంలో గల్లంతైనట్లు ఎస్‌ఐలు తెలిపారు. దుర్గాప్రసాద్‌ను చికిత్స నిమిత్తం తుని ఆస్పత్రికి తరలించారు. అశోక్ నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లమో చదువుతున్నాడు. ఎస్‌ఐ పురుషోత్తం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పాయకరావుపేట పోలీసులు, మైరెన్ పోలీసులు, మత్స్యకారులు బోటు సహాయంతో సాయంత్రం 6 గంటల వరకు అశోక్ కోసం గాలించినా ఆచూకీ లభించలేదు.