
వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మాకవరపాలెం: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పరిశీలించారు. ఈనెల 9న మండలంలోని భీమబోయినపాలెం వద్ద గత ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాల భవనాలను జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకురాలు శోభా హైమావతిలతో కలసి అమర్‌నాథ్, గణేష్ మెడికల్ కళాశాల ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం భద్రత, ఇతర అంశాలపై నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మతో చర్చించారు. కళాశాల భవనాల వద్ద జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం ఉంటుందని అమర్ డీఎస్పీకి తెలిపారు. పూర్తి వివరాలను తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చిటికెల రమణ, పంచాయతీరాజ్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు, నియోజకవర్గంలో వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.