
అంగన్‌వాడీ సిబ్బంది సాంకేతికంగా బలోపేతం
మిగతా 8వ పేజీలో
పాడేరు : అంగన్‌వాడీ సిబ్బందికి తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారిని సాంకేతికంగా బలోపేతం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమంపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా శక్తి కేంద్రాలు, మహిళ పోలీసులను ఉపయోగించుకొని అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం, పిల్లల మానసిక ప్రవర్తన ఆధారంగా గ్రేడింగ్ చేయాలని సూచించారు. అంగన్‌వాడీ సెంటర్లలోని పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని, కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. బలహీనంగా ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు తరచూ అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆధార్ కార్డులు లేని పిల్లలను సర్పంచ్‌ల సహకారంతో ఆధార్ క్యాంపులు నిర్వహించి ఆధార్ జనరేట్ చేయాలన్నారు. పోషణ్ ట్రాకర్ యాప్‌లలో అంగన్‌వాడ కేంద్రానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. సిగ్నల్
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం