ఆశా కార్యకర్తలకునియామక పత్రాలు | - | Sakshi
Sakshi News home page

ఆశా కార్యకర్తలకునియామక పత్రాలు

Oct 8 2025 6:39 AM | Updated on Oct 8 2025 6:39 AM

ఆశా కార్యకర్తలకునియామక పత్రాలు

ఆశా కార్యకర్తలకునియామక పత్రాలు

చింతూరు: స్థానిక డివిజన్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమితులైన ఆశా కార్యకర్తలకు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్‌ మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ డివిజన్లో ఖాళీగా ఉన్న 27 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆగస్టులో కౌన్సెలింగ్‌ నిర్వహించామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామన్నారు. డివిజన్లో మరో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఎంపికై న కార్యకర్తలు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు. గ్రామాల్లో ఆరో గ్య చైతన్యం పెంపొందించేందుకు కృషి చేయాలని పీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement