
జగన్ పర్యటనకు తరలి వెళ్లాలి
● మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లిభాగ్యలక్ష్మి పిలుపు
కొయ్యూరు: అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో ఈనెల 9న జరగనున్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పార్టీ శ్రేణులు తరలివెళ్లి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె కొయ్యూరులో జెడ్పీటీసీ లు వారా నూకరాజు, ఎం.వెంకటలక్ష్మి, ఎంపీపీలు బడుగు రమేష్, అనుషాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీకి చెందిన వివిధ అనుబంధ సంఘాల నేతలు, మాజీ డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తరలి రావాలని ఆ మె కోరారు. జెట్పీటీసీలు జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, జానకమ్మ, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు, సర్పంచ్‌లు వెంకటలక్ష్మి, రీమెల శ్రీను పాల్గొన్నారు.