
● పెరుగుతున్న జ్వర పీడితులు
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో చాపకింద నీరులా జ్వరాలు విజృంభిస్తున్నాయి. స్థానిక సీహెచ్‌సీకి రోజూ జ్వరబాధితులు క్యూ కడుతున్నారు. సీహెచ్‌సీలో ఆగస్టు నెలలో 3,070 మంది రోగులు వైద్య సేవలు పొందగా, వీరిలో 1,796 మంది జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు.సెప్టెంబర్ నెలలో 3,756 మంది వైద్య సేవలు పొందగా 2,123 మంది జ్వర పీడితులున్నారు. ఈ నెలలో ఆరు రోజుల్లోనే 206 మంది జ్వరపీడితులు వైద్య సేవలు పొందారు.రోజు రోజుకు జ్వర పీడితులు పెరుగుతూ ఉండడం గ్రామాల్లో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్య శిబిరాలు విస్తృతంగా జరిగేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కిలగాడ,లబ్బూరు పీహెచ్‌సీలతో పాటు ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో వైద్యులు,సిబ్బంది కొరత ఉండడంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది.