
మేఘాల కొండను ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తాం
పాడేరు ఫారెస్ట్ రెంజ్ అధికారి ప్రేమ
పాడేరు రూరల్: వంజంగి మేఘాలయ కొండను ఎకోటూరిజంగా మరింత అభివృద్ధి చేస్తామని పాడేరు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.ప్రేమ తెలిపా రు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడు తూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపుపొందిన వంజంగి మేఘాల కొండను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యే క దృష్టి సారించినట్టు చెప్పారు. సమీపగ్రామాల గిరిజనుల భాగస్వామ్యంతో వనసంరక్షణ సమి తి (వీఎస్‌ఎస్) ద్వారా మేఘాల కొండ అభివృద్ధి, నిర్వహణ పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. తద్వారా అడవిని మరింత పరిరక్షించడమే కాకుండా, స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశా లు, ఆదాయం పెంచే విధంగా అటవీశాఖ ప్రత్యేక కృషిచేస్తోందన్నారు. ఎకో టూరిజం ప్రాజెక్టుపై వంజంగి, దొడ్డిపల్లి, ఇసంపాల, కొత్తవలస, పోతురాజుమెట్ట ప్రజలకు అభ్యంతరాలు ఉంటే ఈనెల 8లోగా పాడేరు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై 10న చర్చిస్తామన్నారు. మేఘాల కొండ అభివృద్ధికి ప్రజలందరూసహకరించాలని కోరారు.