
పని గంటల పెంపు దుర్మార్గం
అరకులోయటౌన్: పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నర్సింగరావు అన్నారు. జిల్లా సీఐటీయూ రెండవ మహా సభలను సోమవారం అరకులోయలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నర్సింగరావు మాట్లాడుతూ కార్మికులకు తక్కువ జీతాలు చెల్లించి, ఎక్కువ పనిచేయించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. కా ర్మిక వర్గాన్ని అణచివేయాలని, దేశ సంపదను అదానీ వంటి వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఉన్న బాక్సైట్‌లో పాడేరు ఏజెన్సీలో 30 శాతం ఉందన్నారు. మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే గిరిజన, దళిత ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఆర్.శంకర్‌రావు, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్, ఎస్.బి.పోతురాజు, కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు, అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా నాయకురాలు కె. భాగ్య తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సీహెచ్ నర్సింగరావు
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నర్సింగరావు