
విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించేది లేదు
చింతపల్లి: వైద్య సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జిల్లా వైద్య ఆరోగశాఖాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు అన్నారు. మండలంలోని లోతుగెడ్డ, తాజంగి, లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఆరోగ్య కేంద్రా ల్లో రికార్డులను, మందుల నిల్వలను పరిశీలించారు. వార్డులను తనిఖీచేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు.సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధిగా ఉదయం, సాయంత్రం ముఖ హాజరు వేయాలని సూచించారు.ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చే రిఫరల్ కేసులు, అంబులెన్సుల నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బి.లక్ష్మణ్,ఫార్మసీ అధికారి ఎస్. సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు