
శిక్షణను సద్వినియోగం చేసుకోండి
గంగవరం: శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిషు, గణితం లెక్కలు బోధించే ఉపాధ్యాయులందరికీ మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి విడతగా 85 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. డీఆర్‌పీలు దామోదర్ రావు, వెంకన్న దొర, రఘుబాబు దొర, రామచంద్ర రెడ్డి తదితరులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, ఆర్.వి.వి సత్యనారాయణ శ్రీరాములు, సీఆర్పీలు వరప్రసాద్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.