
అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణానికి నిధులు
చింతపల్లి: గూడెం కొత్తవీధి మండలం ఆర్.వి.నగర్–పాలగెడ్డ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.18 కోట్లు నిధులు విడుదల చేసినట్టు ఆర్‌అండ్‌వీ ఏఈఈ బి.జయరాజు తెలిపారు.ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.30 కిలోమీటర్లు అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణానికి రూ.30 కోట్లు నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఈ నెలాఖరు నుంచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.ఇప్పటికే సీలేరు ప్రాంతంలో పనులు ప్రారంభించామని, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా గోతులు పూడ్చి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. నవంబర్ నుంచి వర్షాలు తగ్గు ముఖం పడతాయని అప్పటి నుంచి పూర్తిస్థాయి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు.