
డ్రగ్స్ అనర్థాలపై అవగాహన
అన్నవరంలో ఆటో డ్రైవర్లకు అవగాహన
కల్పిస్తున్న ఈగల్ టీం పోలీసులు
చింతపల్లి: ఆటో డ్రైవర్లు మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ నాగార్జున అన్నారు. మండలంలోని అన్నవరం వారపు సంతలో ఆటో డ్రైవర్లకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ నాగార్జున మాట్లాడుతూ మత్తు పదార్ధాలు జీవితాలను నాశనం చేస్తాయని, వాటికి దూరంగా ఉండాలన్నారు. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు మత్తు పదార్దాలు రవాణాకు ఎక్కువగా ఆటోలనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆటోడ్రైవర్లు కూడా మత్తు పదార్దాల అక్రమ రవాణాపై సామాజిక బాధ్యతగా భావించి పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. ప్రజాప్రతినిదులు, ఆటో యూనియన్ నాయకులు తదితరలు పాల్గొన్నారు.