
సద్దుమణిగిన గ్రామాల సరిహద్దు వివాదం
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం తోకరాయి, చోడిరాయి గ్రామస్తులు ఇకపై గొడవలు చేయమంటూ రెండు పంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు సమక్షంలో ఒప్పంద పత్రాన్ని సీలేరు ఎస్‌ఐ రవీంద్రకు సోమవారం అందజేశారు. తోకరాయి, చోడిరాయి గ్రామాల మధ్య సరిహద్దు వివాదం జరుగుతున్న నేపథ్యంలో సీలేరు ఎస్‌ఐ రవీంద్ర సూచనల మేరకు గుమ్మిరేవుల, దారకొండ పంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు, పెద్దలు, ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు సమావేశమై ఒక అవగాహనకు వచ్చి సీలేరు ఎస్‌ఐకు ఒప్పంద పత్రాన్ని అందజేశారు. ఇందులో భాగంగా తోకరాయి సరిహద్దుకు ఆనుకుని ఉన్న అటవీప్రాంతంలో చోడిరాయి గ్రామస్తులు సాగుచేసుకుంటున్న భూములకు ఎవరికై తే ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలున్నాయో వారు యథావిధిగా సాగుచేసుకోవడానికి, మిగిలిన ప్రాంతంలో సాగుచేసుకుంటున్న చోడిరాయి గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు నుంచి లిఖిత పూర్వక ఆదేశాలు వచ్చేవరకూ సాగుచేయకుండా ఉండటానికి నిర్ణయించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న అటవీప్రాంతంలో తోకరాయి గ్రామస్తులు చెట్లు నరకకుండా ఉండటానికి అంగీకరించినట్టు ఎస్‌ఐ రవీంద్రకు గ్రామపెద్దలు, సర్పంచ్లు, ఎంపీటీసీ వివరించారు. ఇకపై ఎవ్వరూ గొడవపడొద్దుని ఎస్‌ఐ రవీంద్ర ఆయా గ్రామస్తులకు సూచించారు.