
భవిష్యత్ తరాలకు క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలు
సాక్షి, విశాఖపట్నం: అత్యాధునిక, తక్కువ ఖర్చుతో ఇంధన సామర్థ్యాల అమలుపై దృష్టిసారించిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)కు సహకారం అందించేందుకు ఏపీఈపీడీసీఎల్ ముందుకు వచ్చింది. విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డిస్కమ్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, ఈఈఎస్‌ఎల్ సీఈవో అఖిలేష్ కుమార్ దీక్షిత్‌తో కలిసి సీనియర్ అధికారులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల సేవలను మెరుగుపరచడం, స్థిరమైన ఆర్థిక వృద్ధినిప్రోత్సహించడం, భూతాపాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రపంచ స్థాయి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలను అమలు చేసేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్ రూపొందించే అంశంపై చర్చించారు. ఇందులో భాగంగా ఈఈఎస్‌ఎల్‌తో భాగస్వామ్యం ద్వారా విద్యుత్ విని యోగదారుల కోసం ఇ–రిటైల్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన దేశంలో మొట్టమొదటి డిస్కంగా ఈపీడీసీఎల్ నిలిచినట్లు ఈఈఎస్‌ఎల్ సీఈవో అఖిలేష్‌కుమార్ ప్రకటించారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ వినియోగదారులు డిస్కం పోర్టల్ ద్వారా నేరుగా స్టార్–రేటెడ్, ఇంధన–సమర్థవంతమైన ఉపకరణా లను పోటీ ధరలకు కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈపీడీసీఎల్ జాతీయ ఈ–మొబిలిటీ కార్యక్రమం ద్వారా కర్బన ఉద్గారాలు నియంత్రణ, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోలార్ రూఫ్‌టాప్, గ్రౌండ్–మౌంటెడ్ ప్రాజెక్ట్‌లు నిర్వహణతో విద్యుత్ ఉత్పత్తి, వికేంద్రీకృత సౌర పీవీ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు, స్మార్ట్ మీటర్ నేషనల్ ప్రోగ్రామ్, ఇంధన సామర్థ్య ఉపకరణాలు వినియోగంపై విస్త్రృత స్థాయి అవగాహన కల్పిస్తున్నట్లు సీఎండీ ఫృథ్వీతేజ్ వెల్లడించారు.
ఇంధన సామర్థ్య నిర్వహణ అమలులో
ఈపీడీసీఎల్ పనితీరును గుర్తించిన ఈఈఎస్‌ఎల్