
పాల నురగల పరవళ్లు
మిగతా 8వ పేజీలో
అల్లూరి మన్యం పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేవి జలపాతాలు. ఈ ఏడాది అధిక వర్షాలకు పొంగి పొర్లుతున్నాయి. పచ్చని కొండల నడుమ జలజలా పారుతూ సవ్వడి చేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికుల మదిని దోచేస్తున్నాయి. దివి నుంచి భువికి జాలు వారుతున్నట్టుగా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మన్యంలో ప్రారంభం కానున్న పర్యాటక సీజన్‌కు రా..రమ్మని స్వాగతిస్తున్నాయి.
● పొంగి పొర్లుతూ.. జాలువారుతూ..
● కనువిందు చేస్తున్న జలపాతాలు
● పచ్చని కొండలమధ్య నుంచి పాల పొంగును తలపిస్తూ పర్యాటక సీజన్‌కు స్వాగతం
అరకులోయ టౌన్: జిల్లాలో వందల అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పరవళ్లు తొక్కుతూ పాలనురగను తలపిస్తూ జాలువారుతున్న జలపాతాలను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. వీటిని తిలకించేంఉదకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. జలపాతాలు, మేఘాలను తాకే కొండలు, పాడేరు అరకు లంబసింగిలోని ఆహ్లాదం పంచే పర్యాటక ప్రాంతాలను సందర్శించి తనివితీరా ఆస్వాదిస్తారు.
అద్భుతం.. కటికి జలపాతం
అనంతగిరి మండలంలోని బొర్రా గుహలకు ఐదు కిలోమీటర్ల దూరంలో కటికి జలపాతం ఉంది. దీని ప్రత్యేకతను మాటల్లో

పాల నురగల పరవళ్లు