
చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం
చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం. విత్తనాలు పంపిణీ చేశాం. దీంతో ఈ ఏడాది మరో ఐదు వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 2024–25లో కిలో రాగులు రూ. 42.90, 2025–26లో రూ.48.50 చొప్పున కొనుగోలు చేశాం. – ఎస్‌బీఎస్ నందు, జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు
ప్రొటీన్ ఎక్కువ
గుమ్మడి, పొద్దు తిరుగుడు గింజల్లో సాధారణ బియ్యం కంటె ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటి వినియోగం వల్ల కొవ్వు ప్రభావం తగ్గుతుంది. విజయనగరం గంట స్తంభం దగ్గర దుకాణంలో కొనుగోలు చేస్తుంటాం.
– జి. సురేంద్ర,
ఉపాధ్యాయుడు, విజయనగరం
సామ, కొర్రతో ఉప్మా
సామ, కొర్ర బియ్యంతో తయారు చేసిన ఉప్మాను ఉదయం కుటుంబ సమేతంగా తీసుకుంటాం. అంతకుముందు రాగి జావ తాగుతాం. ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా పూర్వీకుల మాదిరిగా వినియోగిస్తున్నాం. – డాక్టర్ దాదాజీ,
పర్యాటకుడు, కాకినాడ
అమ్మకాలు బాగున్నాయి
మ్యూజియంలో ఏర్పాటుచేసిన స్టాల్‌లో అన్ని రకాల సిరిధాన్యాలతోపాటు అటవీ ఉత్పత్తులు గ్రేడింగ్ చేసి విక్రయిస్తున్నాం. బియ్యం, రాగి పిండిఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
– జన్ని రోజా,
చిరు ధాన్యాల విక్రేత, అరకులోయ
ఆదాయం బాగుంది
గతంలో సామలు, చోడి, కొర్ర ధరలు చాలా తక్కువగా ఉండేవి.ప్రస్తుతం రాగులు కిలో రూ. 40, సామలు రూ. 34కు కొనుగోలు చేస్తున్నారు. చిరుధాన్యాల సాగు చేయడం వల్ల ఆదాయం చాలా బాగుంది. – పదాల విశ్వనాథ్,
గిరిరైతు, బోసుబెడ, అరకులోయ

చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం

చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం

చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం

చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం