రేపటి నుంచి మండల స్థాయి క్రీడాపోటీలు
డీఈవో బ్రహ్మాజీరావు
పాడేరు రూరల్: జిల్లాలో ఈ నెల 6వ తేదీనుంచి జరిగే (స్కూల్ గేమ్స్) మండల స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని డీఈవో బ్రహ్మజీరావు కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో ఈ పోటీల నిర్వహణకు క్రీడా కోఆర్డినేటర్లను నియమించమన్నారు.మండల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్, యోగా, చెస్, అథ్లెటిక్స్‌లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తిగల క్రీడా కారులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పాంగి సూరిబాబును 9441105964, భవానీని 9494005843 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.


