
సంపూర్ణ గ్రామాభివృద్ధికి ప్రణాళికలు
కూనవరం: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆది కర్మయోగి కార్యక్రం ద్వారా 2030 నాటికి సంపూర్ణ గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అధికారులకు సూచించారు. గురువారం చినార్కూరులో రచ్చబండ వద్ద నిర్వహించిన గ్రామసభకు హాజరైన ఆయన పలు సూచనలు ఇచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చినార్కూరు గ్రామా భివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను గ్రామ సభలో చదివి వినిపించాలని సూచించారు. కాగా రూ. 11.34 కోట్లతో ఐదేళ్లలో చేపట్టనున్న అభివృద్ధికి సంబంధించిన అంశాలను తెలియజేశారు. అదనంగా చేర్చాల్సిన సమస్యలు ఏవైనా ఉన్నాయని పీవో స్థానికుల నుంచి తెలుసుకున్నారు. ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్ సున్నం అభిరామ్, ఎంపీడీవో జగన్నాథరావు, తహసీల్దార్ కె శ్రీనివాసరావు, కార్యదర్శి టీరోజ, పెసా కార్యదర్శి కుంజా అనిల్ పాల్గొన్నారు.
చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్